Pages

Showing posts with label Deepotsavam. Show all posts
Showing posts with label Deepotsavam. Show all posts

Friday, 21 November 2014

POLI SWARGANIKI VELLU KATHA

పోలి  స్వర్గానికి వెళ్ళు కథ
        
Poli Swargam 
           పూర్వం ఒకానొక నగరమందు ఐదుగురు కోడళ్ళుగల చాకలి ఉండేది. ఆ కోడళ్ళలోని ఆఖరు కోడలంటే వాళ్ళెవ్వరికి గిట్టేది కాదు. అందువల్ల వీళ్ళు ఏమిచేసినా ఏ పండుగ పబ్బం వచ్చినా చిన్న కోడల్ని పట్టించుకునేవారు కాదు, తమతో కలుపుకునే వారుకాదు. చిన్న కోడలు పేరు పోలి. పోలి గుణవంతురాలు నిరాడంబరమైనది. వారంతా తనను ఎంత వెలితి భావంతో చూసినా ఏవిధంగానూ వారిని ఎప్పుడు ఏమి అనేదికాదు. తన పూజలు తన పనులు తానూ చేసుకుంటూ  ఇరుగుపొరుగు వాళ్ళతోకూడా  ఎంతో స్నేహంగా  ఉండేది .
             కార్తీక మాసం నెల రోజులు తోటికోడళ్ళు, అత్తగారూ నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలిని ఇంటిదగ్గర కాపలాగా ఉంచేవారు. ఇంటిదగ్గర ఉన్న పోలి  ఇంటిలోని నూతి వద్ద స్నానం చేసి మజ్జిగ చిలికి వెన్నతీయగా చివరన కవ్వానికి అంటిన వెన్నను తీసి ప్రత్తి చెట్టు వద్ద కింద పడిన ప్రత్తితో వత్తిని చేసి ఆ వెన్నతో దీపారాధన చేసి దేవతారాధన చేసేది. నెల రోజులు ఇలా ఎంతో భక్తితో ఆరాధన చేసిన ఆమె భక్తికి దేవతలు మెచ్చి దేవదూతలతో ఆమె కొరకు విమానం పంపిరి.దేవదూతలు విమానంలో పాలిని స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. పోలి స్వర్గానికి వెళ్ళటం ఇరుగుపొరుగు వాళ్ళు,ఊళ్ళో వాళ్ళు,అత్తగారు,తోటికోడళ్ళు గమనించిరి.
Poli Swargam Deepam
ఊరిజనం పోలి  స్వర్గానికి వెళ్తోంది అని ఆనందంతో కేరింతలు కొట్టారు. నదీ స్నానం చేస్తున్న అత్తగారు తోటికోడళ్ళు మీదుగా దేవ విమానం వెళ్తోంది. వారందరూ పోలి కాళ్ళు పట్టుకుని వ్రేలాడుతూ స్వర్గానికి వెళ్ళారు. అక్కడ దేవదూతలు ఆ నలుగురు తోటికోడళ్ళు,అత్తగారిని గమనించి మీకు స్వర్గంలో స్థానం లేదు. మీరు పోలిని ఎన్నో విధములుగా బాధలు పెట్టినప్పటికీ ఆమె ఏమి అనక తనపని తాను చూసుకుంది.ఆమె పరమ భక్తురాలు. కార్తీక మాసం నెలరోజులు భక్తితో జ్యోతులు వెలిగించింది. ఆమెకు మాత్రమే స్వర్గానికి వచ్చుటకు అర్హురాలు. 

                    మీకు అటువంటి అర్హత లేదు అని కిందకు పడవేసెను. భగవంతునకు ఎంతో  భక్తితోశ్రద్ధతో పూజ చేసిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పోలి కథను చెప్పుకుని అక్షతలు తలమీద వేసుకున్నవారికి ఇహలోక సుఖమే కాక పరలోకములో మోక్షప్రాప్తి కలుగుతాయి. 

                  కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతి గా వచ్చింది. కుదరిని వాళ్ళు ఇంటి వద్దనే ఒక నీళ్ళ ఉంచిన టబ్బులో కానీ అరటి డొప్పలో దీపాలు వెలిగిస్తారు.                     

Poli Swargam Pooja at Home