ధనుర్మాసము
(డిసెంబర్ 16, 2014, మంగళవారం)
"ధనుర్మాసము" ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో ప్రధానమైనవి చాంద్రమానం, సౌరమామానం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని
"ధనుర్మాసము" అంటారు. ఈ నెల శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. సూర్యుడు ధనూరాశిలో
ప్రవేశించడాన్ని
'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడి ని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నం గా ముగ్గును తీర్చిదిద్దుతారు.
ఈ "ధనుర్మాసము"లో ఆ మహా విష్ణువును ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా మంచి సత్పలితాలను

ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె
"తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతిని అర్జించాయి .దీనిలో
“తిరు” అంటే మంగళ కరమైన అని,
“పావై” అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది. వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూవస్తారు.
"ధనుర్మాసము" అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈ ధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమవుతాము.

ధనుస్సు మార్గశిర మాసములో వస్తుంది. ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి.
"గో "అనే శబ్దానికి జ్ఞానము అని,
"ద" అనే శబ్దానికి “ఇచ్చునది” అని అర్ధం. గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణు ఆలయాల్లో
తప్పనిసరిగా గానము చేస్తారు.
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .


ధనుర్మాసం అరంబాన్నే
"సంక్రాంతి నెల" పట్టడము అంటారు. ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ, జంగమ దేవర లతో, గంగిరెద్దులను ఆడించేవారితోనూ, సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులు, ఆవు పేడతో గొబ్బెమ్మలుతో కనుల విందుగా వుంటుంది. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాల్లతో పల్లెలు
"సంక్రాంతి" పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి.