This blog contains articals about Important days which are related to Hindu's and stotras. Here you can search every thing about all Hindu festivals.
Pages
Showing posts with label Ugadi. Show all posts
Showing posts with label Ugadi. Show all posts
Thursday, 7 April 2016
Friday, 20 March 2015
UGADI / ఉగాది
ఉగాది
ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగ లలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి.
ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుంటారు. దేవాలయములకు వెళ్ళి పూజలు చేయిస్తారు.
ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
ఉగాది నిర్ణయం
"ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ దేముడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంబించిన రోజు.
దీనికి ఆధారం వేదాలను అధారం చేసుకొని వ్రాయబడిన "సూర్య సిద్ధాంతం" అనే ఖగోళ జ్యోతిష గ్రంథంలోని శ్లోకం
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తధై వచ'"
అనగా బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువు లో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్ధం.
అందుకే మొదటి సంవత్సరానికి "ప్రభవ" అని పేరు. చివరి అరవైయ్యొవ సంవత్సరం పేరు "క్షయ" అనగా నాశనం అని అర్ధం. కల్పాంతం లో సృష్టి నాశనమయ్యేది కూడ "క్షయ" సంవత్సరంలోనే.
అందుచేతనే చైత్రమాసం లో శుక్లపక్షం లో సూర్యోదయ సమయానికి పాడ్యమి తిథి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది.
ఉగాది ప్రాముఖ్యం
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ.

ఉగాది సాంప్రదాయాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం నూతన సంవత్సరాది స్తోత్రం నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం) ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) పంచాంగ శ్రవణం మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.
ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు!
అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
ఉగాది పూజ
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు.
ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.
ఉగాది పచ్చడి

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.
ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది.
ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి.
ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది.
సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు.
కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి.
కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది.
పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు.

ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఉగాదిపచ్చడి ప్రాముఖ్యత
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది.
పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
ఉగాది ప్రసాదం
.jpg)
ఉగాది పంచాంగ శ్రవణం
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఎండలు ఎలా ఉంటాయి? గ్రహణాలు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. శుభకార్యాలకు,పూజా పునస్కారాలకు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు. ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
కవి సమ్మేళనం
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో.
ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
వివిధ ఉగాదులు
ఉగాది దేశంలోని పలు ప్రాంతాలో వివిద పేర్లతో జరుపుతారు అవి
మరాఠీ - గుడి పడ్వా
తమిళ - పుత్తాండు
మళయాళీల - విషు
సిక్కుల - వైశాఖీ
బెంగాలీ - పొయ్‌లా బైశాఖ్
Saturday, 13 December 2014
TELUGU YEARS

According to Telugu Calendar we have 60 years, each telugu year has a specific name in Telugu Panchangam. Every 60 years one name cycle completes and the name repeats in the next cycle.
For example, The Telugu name for 1947 is "Sarvajit - సర్వజిత్", repeated in 2007.
One more example, The Telugu name for 1986 is "AKSHAYA అక్షయ" again it comes in the year 2046.
The year cycle is Ugadi to Ugadi (ఉగాది/యుగాది, Samvatsaradi) the new year starts for telugu speaking people. Ugadi comes in the Spring season (usually in March or April). the new Year Starts for telugu speaking people.
The sixty Telugu year names in ENGLISH and TELUGU are as follows:
- Prabhava - ప్రభవ (1867,1927,1987)
- Vibhava - విభవ (1868,1928,1988)
- Sukla - శుక్ల (1869,1929,1989)
- Pramoduta - ప్రమోదూత(ప్రమోద) (1870,1930,1990)
- Prajothpatti - ప్రజోత్పత్తి(ప్రజాపతి) (1871,1931,1991)
- Angirasa - అంగీరస(అంగిర) (1872,1932,1992)
- Srimukha - శ్రీముఖ (1873,1933,1993)
- Bhava - భావ(భవ) (1874,1934,1994)
- Yuva - యువ (1875,1935,1995)
- Dhata - ధాత (1876,1936,1996)
- Iswara - ఈశ్వర (1877,1937,1997)
- Bahudhanya - బహుధాన్య (1878,1938,1998)
- Pramadhi - ప్రమాధి (1879,1939,1999)
- Vikrama - విక్రమ (1880,1940,2000)
- Vrisha - వృష (1881,1941,2001)
- Chitrabhanu - చిత్రభాను (1882,1942,2002)
- Svabhanu - స్వభాను(సుభాను) (1883,1943,2003)
- Tarana - తారణ (1884,1944,2004)
- Parthiva - పార్థివ (1885,1945,2005)
- Vyaya - వ్యయ (1886,1946,2006)
- Sarvajit - సర్వజిత్ (1887,1947,2007)
- Sarvadhari - సర్వధారి (1888,1948,2008)
- Virodhi - విరోధి (1889,1949,2009)
- Vikruti - వికృతి (1890,1950,2010)
- Khara - ఖర (1891,1951,2011)
- Nandana - నందన (1892,1952,2012)
- Vijaya - విజయ (1893,1953,2013)
- Jaya - జయ (1894,1954,2014)
- Manmadha - మన్మధ (1895,1955,2015)
- Durmukhi - దుర్ముఖి (1896,1956,2016)
- Hevalambi - హేవళంబి(హేమలంబి) (1897,1957,2017)
- Vilambi - విళంబి (1898,1958,2018)
- Vikari - వికారి (1899,1959,2019)
- Sarvari - శార్వరి (1900,1960,2020)
- Plava - ప్లవ (1901,1961,2021)
- Subhakrit - శుభకృత్ (1902,1962,2022)
- Sobhakrit - శోభకృత్(శోభనః) (1903,1963,2023)
- Krodhi - క్రోధి (1904,1964,2024)
- Viswavasu - విశ్వావసు (1905,1965,2025)
- Parabhava - పరాభవ (1906,1966,2026)
- Plavanga - ప్లవంగ (1907,1967,2027)
- Kilaka - కీలక (1908,1968,2028)
- Soumya - సౌమ్య (1909,1969,2029)
- Sadharana - సాధారణ (1910,1970,2030)
- Virodhikrit - విరోధికృత్ (1911,1971,2031)
- Paridhavi - పరీధావి (1912,1972,2032)
- Pramadi - ప్రమాదీ(చ) (1913,1973,2033)
- Ananda - ఆనంద (1914,1974,2034)
- Rakshasa - రాక్షస (1915,1975,2035)
- Nala - నల (1916,1976,2036)
- Pingala - పింగళ (1917,1977,2037)
- Kalayukti - కాళయుక్తి (1918,1978,2038)
- Siddharthi - సిద్ధార్థి (1919,1979,2039)
- Roudri - రౌద్రి (1920,1980,2040)
- Durmathi - దుర్మతి (1921,1981,2041)
- Dundubhi - దుందుభి (1922,1982,2042)
- Rudhirodgari - రుధిరోద్గారి (1923,1983,2043)
- Raktaksha - రక్తాక్ష(క్షి) (1924,1984,2044)
- Krodhana - క్రోధన (1925,1985,2045)
- Akshaya - అక్షయ (1926,1986,2046)
Labels:
Telugu Calender Years.,
Telugu Years,
Ugadi
Location:
Vijayawada, Andhra Pradesh, India
Subscribe to:
Posts (Atom)