Pages

Showing posts with label read about datta jayanthi. Show all posts
Showing posts with label read about datta jayanthi. Show all posts

Friday, 5 December 2014

Sri Dattatreya Swamy Jayanthi

శ్రీ దత్తాత్రేయ జయంతి
(మార్గశిర పౌర్ణమి)
దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ | 
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
 భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
 దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహామునిమహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మవిష్ణుపరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతోచంద్రుడు బ్రహ్మ అంశతోదుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.
జననము :

అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగాఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి :

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మీసర్వస్వతిపార్వతి మాతలుమహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని  సర్వులకు  తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?
ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంతవారించినాపెడచెవిని పెట్టారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతు పాడారు. ఇక చేసేది ఏమి లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించిందివృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలనో  ఏమిటోఅడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటోఅని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలుమరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం ముగ్గురం కూడా  చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం అసలు విషయం  మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాంఅని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికిదేవహూతికి జన్మించిన అనసూయాదేవినిముని శ్రేష్టుడు అయిన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూఅతిధి అభ్యాగతులను ఆదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూపంచభూతాలుఅష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లినిదివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులుసాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసిఅనంతరం మీరు మువ్వురు బ్రహ్మవిష్ణుమహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారుభోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో.... చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు. వారి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త"ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు అయినది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టిస్థితిలయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారావీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదాఅని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలాఅనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవాయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలుఋషిబాలురు కలిసి మెత్తని పూల పాన్పుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. "ఇ "ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి....! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి ఆశ్చర్యపడి మరలాతేరుకునితన దివ్య దృష్టితో జరిగినదిజరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఆ బాలలను ఆ ఆశ్రమమునందే ఉంచినారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్యము ఆ బాలురకు  చాలాకాలం కొనసాగుతుంది.

ఇలా ఉండగా! లక్ష్మీసరస్వతిపార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్సుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చిఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించిస్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతోఒకేరూపుతోఅమాయకంగా నోట్లో వేలువేసుకొనినిద్రిస్తున్న ఆ
జగన్నాటక సూత్రధారులను ఎవరుఎవరోగుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్యఅసూయద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించిఈ ఆశ్రమవాస సమయమందుమీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికిమీకు మేము ముగ్గురము దత్తమవుతున్నాము. మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మశివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి ఇచ్చినారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.
                  దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్రగుర చరిత్రఅవధూత గీతజీవన్ముక్త గీతశ్రీపాదవల్లభ చరిత్రనృసింహసరస్వతి చరిత్రషిర్డి సాయిబాబా చరిత్రంశ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు.

శుభం