Pages

Friday 21 November 2014

POLI SWARGANIKI VELLU KATHA

పోలి  స్వర్గానికి వెళ్ళు కథ
        
Poli Swargam 
           పూర్వం ఒకానొక నగరమందు ఐదుగురు కోడళ్ళుగల చాకలి ఉండేది. ఆ కోడళ్ళలోని ఆఖరు కోడలంటే వాళ్ళెవ్వరికి గిట్టేది కాదు. అందువల్ల వీళ్ళు ఏమిచేసినా ఏ పండుగ పబ్బం వచ్చినా చిన్న కోడల్ని పట్టించుకునేవారు కాదు, తమతో కలుపుకునే వారుకాదు. చిన్న కోడలు పేరు పోలి. పోలి గుణవంతురాలు నిరాడంబరమైనది. వారంతా తనను ఎంత వెలితి భావంతో చూసినా ఏవిధంగానూ వారిని ఎప్పుడు ఏమి అనేదికాదు. తన పూజలు తన పనులు తానూ చేసుకుంటూ  ఇరుగుపొరుగు వాళ్ళతోకూడా  ఎంతో స్నేహంగా  ఉండేది .
             కార్తీక మాసం నెల రోజులు తోటికోడళ్ళు, అత్తగారూ నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలిని ఇంటిదగ్గర కాపలాగా ఉంచేవారు. ఇంటిదగ్గర ఉన్న పోలి  ఇంటిలోని నూతి వద్ద స్నానం చేసి మజ్జిగ చిలికి వెన్నతీయగా చివరన కవ్వానికి అంటిన వెన్నను తీసి ప్రత్తి చెట్టు వద్ద కింద పడిన ప్రత్తితో వత్తిని చేసి ఆ వెన్నతో దీపారాధన చేసి దేవతారాధన చేసేది. నెల రోజులు ఇలా ఎంతో భక్తితో ఆరాధన చేసిన ఆమె భక్తికి దేవతలు మెచ్చి దేవదూతలతో ఆమె కొరకు విమానం పంపిరి.దేవదూతలు విమానంలో పాలిని స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. పోలి స్వర్గానికి వెళ్ళటం ఇరుగుపొరుగు వాళ్ళు,ఊళ్ళో వాళ్ళు,అత్తగారు,తోటికోడళ్ళు గమనించిరి.
Poli Swargam Deepam
ఊరిజనం పోలి  స్వర్గానికి వెళ్తోంది అని ఆనందంతో కేరింతలు కొట్టారు. నదీ స్నానం చేస్తున్న అత్తగారు తోటికోడళ్ళు మీదుగా దేవ విమానం వెళ్తోంది. వారందరూ పోలి కాళ్ళు పట్టుకుని వ్రేలాడుతూ స్వర్గానికి వెళ్ళారు. అక్కడ దేవదూతలు ఆ నలుగురు తోటికోడళ్ళు,అత్తగారిని గమనించి మీకు స్వర్గంలో స్థానం లేదు. మీరు పోలిని ఎన్నో విధములుగా బాధలు పెట్టినప్పటికీ ఆమె ఏమి అనక తనపని తాను చూసుకుంది.ఆమె పరమ భక్తురాలు. కార్తీక మాసం నెలరోజులు భక్తితో జ్యోతులు వెలిగించింది. ఆమెకు మాత్రమే స్వర్గానికి వచ్చుటకు అర్హురాలు. 

                    మీకు అటువంటి అర్హత లేదు అని కిందకు పడవేసెను. భగవంతునకు ఎంతో  భక్తితోశ్రద్ధతో పూజ చేసిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి పోలి కథను చెప్పుకుని అక్షతలు తలమీద వేసుకున్నవారికి ఇహలోక సుఖమే కాక పరలోకములో మోక్షప్రాప్తి కలుగుతాయి. 

                  కార్తీక అమావాస్య మరుసటి రోజు అంటే మార్గశిర పాడ్యమి నాడు నదీ స్నానం ఆచరించి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టడం ఆనవాయతి గా వచ్చింది. కుదరిని వాళ్ళు ఇంటి వద్దనే ఒక నీళ్ళ ఉంచిన టబ్బులో కానీ అరటి డొప్పలో దీపాలు వెలిగిస్తారు.                     

Poli Swargam Pooja at Home


    

Wednesday 5 November 2014

KARTHIKA POURNAMI

కార్తీక పౌర్ణమి

KARTHEEKA DEEPAM BY GANAPATHI SACHIDANANDA SWAMY
SRI GANAPATHI SACHIDANANDA SWAMY VARU

కార్తీక పౌర్ణమి అంటే హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన రోజు. ఈ పర్వదినాన్ని "త్రిపురి పౌర్ణమి" అని కూడా అంటారు. ఆశ్వీయుజ అమావాస్య వెళ్ళిన మరునాడు నుండి కార్తీకమాసం ప్రరంభామావ్తుంది. ఆ రోజు నుండి కార్తీకమాసం చివరి రోజు వరకు ప్రతి రోజు సాయంత్రం పూట దీపాలు వెలిగించాలి. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు చేస్తారు.ఈ నెల అంతా కార్తీక మహా పురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణం శ్రవణం చేస్తారు. 
మహాభారతం కథనాన్ని అనుసరించి కార్తీకేయుడు తారకాసురుని సంహరించిన రోజు కార్తీక పుర్నమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన సుభసందర్భంగా పరమేశ్వరుడు తాండవం చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి
Karthika Pournami Deepam / కార్తీక పౌర్ణమి దీపం
KARTHIKA DEEPAM 
కార్తీక పౌర్ణమి శివునికి మరియు విష్ణుమూర్తి కి ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్ని తొలిగిపోతాయి. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన చాల శ్రేష్టం. కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం లేక సముద్ర స్నానం చేసిన మంచి ఫలితం లభిస్తుంది.
కార్తీక దీపోత్సవము
కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపోత్సవము
ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజు కి ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కొందరు దీపాలని అరటి దొన్నలో వెలిగించి నదిలో లేక కొలనులో వదులుతారు. ఇంకొంతమంది శివాలయం లో కానీ ఇంటివద్దనే కానీ దీపం వెలిగిస్తారు.

తులసి పూజ కార్తీక పౌర్ణమి
తులసి పూజ
కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పుజించాడం. సకల పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుంది అని ప్రతీతి. 

Tuesday 4 November 2014

CHILUKU DWADASI / KSHEERABDHI DWADASI

చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి

కార్తీక మాసం లో ప్రధానమైనది చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం లో 12వ రోజు ని చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి లేక యోగీశ్వర ద్వాదశి లేక హరిబోధిని ద్వాదశి అని అంటారు. పాల సముద్రం లో శేష శయ్యన పై ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శయ్యనించి, నాలుగు నెలలు యోగ నిద్ర లో  గడిపి విష్ణు మూర్తి మేల్కొని భూమి మీదకి దృష్టి సారించే రోజు బోధనైకాదశి/ఉత్థాన ఏకాదశి. కాబట్టి తరువాత రోజు చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి ని పరమ పుణ్యదినంగా భావిస్తారు. ఈ రోజున తులసి మరియు ఉసిరి మొక్కలని పూజిస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తారు.

ఈ రోజు మరో విశిష్టత ఏమిటంటే ఎల్లవేళలా శేషశయ్యన పై శయ్యనించే విష్ణుమూర్తి ఈ రోజున దేవతలందరి తో కలసి బృందావనానికి వెళ్తారు. అందువలన ఈ రోజు ఎవరైతే శ్రద్ధగా విష్ణుమూర్తి ని పూజిస్తారో వారికీ ఆయురారోగ్యాలు మరియు సిరి సంపదలు కలుగుతాయి అని పురాణాలకధనం

ఈ రోజు చేసే స్నానాదులు వలన సర్వ పుణ్య తీర్థాల లో  చేసే స్నాన ఫలము మరియు యజ్ఞ యాగాదులు చేసే ఫలితం లభిస్తుంది. ద్వాదశి ముందు రోజు అంతే బోధనైకాదశి/ఉత్థాన ఏకాదశి ఉపవాసం వుండి జాగరణ చేసి ద్వాదశి నాడు వ్రతం ఆచరించి విష్ణు మూర్తి కి నైవేద్యం సమర్పించి అన్నదానం చేస్తే అనంత పుణ్య ఫలం. అన్నదానం వలన సూర్య గ్రహణం రోజున గంగా నదీ తీరములో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వుంటుంది.

క్షీర సాగరాన్ని మదించేందుకు కవ్వంగా భూమధ్య స్థానం లో వున్న  మందర పర్వతాన్ని దానికి తోడుగా వాసుకీ సర్పాన్ని చేస్కొని చిలికేందుకు పర్వతాన్ని సంముద్రం లో కి దిన్చాగానే, ఆదారం లేక పట్టు తప్పి పడిపోయింది దాన్ని పైకి లేపి సాగరాన్ని మధించేందుకు వీలుగా విష్ణు మూర్తి కూర్మాఅవతారాన్ని ఎత్తారు. దేవదిదేవులు క్షీరసాగరన్ని మదించారు. ఆ సమయంలో పుట్టిన హాలాహలాన్ని పరమశివుడు కంఠంలో ధరించి సమస్త విశ్వాన్ని కాపాడాడు. ఆ తరువాత క్షీరసాగరం నుండి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం వంటివి జన్మించిన తరువాత ఒక స్త్రీ ఉద్భవించింది, ఆమే లక్ష్మీదేవి. ఈ క్షీరబ్దిద్వాదశి నాడు శ్రీ హరి లక్ష్మీ దేవిని వివాహమాడాడు. అందు వలన క్షీరబ్దిద్వాదశి నాడు సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ ని పుజిస్తారు. ఈ రోజు తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్క వుంచి పూజిస్తే అనంత పుణ్య ఫలం కలుగుతుంది అని ప్రతీతి.
KSHEERA SAGARA MADHANAM

కార్తీకమాసంలో రోజు దీపాలు వెలిగించాలేకపోతే ఈ శుద్ధ ద్వాదశి, చతుర్దశి మరియు పౌర్ణమి రోజులలో పెట్టాలి. దీని వలన వైకుంట ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం మరియు దీని వలన అనంత పుణ్య ఫలాన్నిచే పవిత్ర పుణ్యదినం ఈ క్షీరాబ్ది ద్వాదశి.
THULASI POOJA

SRI GANAPATHI SLOKAM


శ్రీ గణపతి ప్రార్ధన



 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ |
        ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||