Pages

Wednesday 31 December 2014

List of Ekadasi's

ఏకాదశులు 
According to Panchangam we have total 26 Ekadasi's, for viewers sake I am posting this.
Check it and give me your valuable comments and ideas. 
For information follow this blog regularly. Click here to like Facebook page.

1.ఉత్పన్న ఏకాదశి - Utpana 
2.మోక్షద ఏకాదశి - Mokshada
3.సపల ఏకాదశి - Saphala
4.పుత్రద ఏకాదశి - Putrada

5.షట్టిల ఏకాదశి - Sattila



6.జయ ఏకాదశి - Jaya / Bhaimi

7.విజయ ఏకాదశి - Vijaya
8.అమలకి ఏకాదశి - Amalaki
 9.పాపమోచనీ ఏకాదశి - Paapmochani
10.కామద ఏకాదశి - Kamada
11.వరూధినీ ఏకాదశి - Varutini
12.మోహిని ఏకాదశి - Mohini
13.అపర ఏకాదశి - Apara
14.నిర్జల ఏకాదశి - Nirjala
15.యోగినీ ఏకాదశి - Yogini
16.శయన ఏకాదశి - Sayana / Padma
17.కామిక ఏకాదశి - Kamika
18.పవిత్ర ఏకాదశి - Pavitropana
19.అన్నద ఏకాదశి - Aja / Annada
20.పార్శ్వ ఏకాదశి - Parvartini / Parsva
21.ఇందిర ఏకాదశి - Indira
22.పాశాంకుశ ఏకాదశి - Pasankusha
23.రమ ఏకాదశి - Rama
24.ఉత్దాన ఏకాదశి - Haribhodini / Utthana
25.పద్మిని ఏకాదశి - Adik maas / Padmini
26.పరమ ఏకాదశి - Parama   

Monday 29 December 2014

VAIKUNTHA EKADASHI / MUKKOTI EKADASHI

ముక్కోటి ఏకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి
పంచాంగం ప్రకారం ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. "ఏకాదశి" పాడ్యమి నుండి వచ్చే పదకొండవ రోజు ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. 
సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి లేక వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.
 వైష్ణవ ఆలయాల్లో భక్తులు తెల్లవారుజామున నుండి దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుదై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క రోజు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకునందువల్ల దిన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడు హాలాహలం, అమృతం పుట్టాయి. 
ఈ రోజున శివుడు హాలాహలం మింగాడు,
మరియు మహా భారత యుద్ధ సమయంలో భగవద్గీతను శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని విశ్వాసం. గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. 
అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలలో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.  తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మ పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. 
ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. 
 వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. 
ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది.  వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అర్థం. దశమి నాడు రాత్రి జాగారం చేసి ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు బ్రాహ్మణుడికి అవపోసన వేస్కోని భోజనం చేయాలి.

Monday 15 December 2014

DHANURMASAM

ధనుర్మాసము 
(డిసెంబర్ 16, 2014, మంగళవారం)
SRI MAHA VISHNUVU"ధనుర్మాసము"  ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో ప్రధానమైనవి చాంద్రమానం, సౌరమామానం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని "ధనుర్మాసము" అంటారు. ఈ నెల శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది.  సూర్యుడు ధనూరాశిలో
ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడి ని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నం గా ముగ్గును తీర్చిదిద్దుతారు.
ఈ "ధనుర్మాసము"లో ఆ మహా విష్ణువును ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా మంచి సత్పలితాలను
 GODA DEVIప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె "తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతిని అర్జించాయి .దీనిలో “తిరు” అంటే మంగళ కరమైన అని, “పావై” అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది. వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూవస్తారు.
"ధనుర్మాసము" అంటే
ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈ ధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమవుతాము.
 GANGIREDDUధనుస్సు మార్గశిర మాసములో వస్తుంది. ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి. "గో "అనే శబ్దానికి జ్ఞానము అని, "ద" అనే శబ్దానికి “ఇచ్చునది” అని అర్ధం. గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణు ఆలయాల్లో
 తప్పనిసరిగా గానము చేస్తారు.
ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
 GOBBEMMA HARIDASUధనుర్మాసం అరంబాన్నే "సంక్రాంతి నెల"  పట్టడము అంటారు. ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ, జంగమ దేవర లతో, గంగిరెద్దులను ఆడించేవారితోనూ, సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గులు, ఆవు పేడతో గొబ్బెమ్మలుతో  కనుల విందుగా వుంటుంది. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాల్లతో పల్లెలు "సంక్రాంతి" పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి.

Saturday 13 December 2014

TELUGU YEARS

telugu years || Samvatsralu
According to Telugu Calendar we have 60 years, each telugu year has a specific name in Telugu Panchangam. Every 60 years one name cycle completes and the name repeats in the next cycle.
For example, The Telugu name for 1947 is "Sarvajit - సర్వజిత్", repeated in 2007.
One more example, The Telugu name for 1986 is "AKSHAYA అక్షయ" again it comes in the year 2046.
The year cycle is Ugadi to Ugadi (ఉగాది/యుగాది, Samvatsaradi)  the new year starts for telugu speaking people. Ugadi comes in the Spring season (usually in March or April). the new Year Starts for  telugu speaking people.

The sixty Telugu year names in ENGLISH and TELUGU are as follows:
  1. Prabhava - ప్రభవ (1867,1927,1987)
  2. Vibhava విభవ (1868,1928,1988)
  3. Sukla శుక్ల (1869,1929,1989)
  4. Pramoduta - ప్రమోదూత(ప్రమోద) (1870,1930,1990) 
  5. Prajothpatti ప్రజోత్పత్తి(ప్రజాపతి) (1871,1931,1991)
  6. Angirasa అంగీరస(అంగిర) (1872,1932,1992)
  7. Srimukha శ్రీముఖ (1873,1933,1993)
  8. Bhava భావ(భవ) (1874,1934,1994)
  9. Yuva యువ (1875,1935,1995)
  10. Dhata ధాత (1876,1936,1996)
  11. Iswara ఈశ్వర (1877,1937,1997)
  12. Bahudhanya బహుధాన్య (1878,1938,1998)
  13. Pramadhi ప్రమాధి (1879,1939,1999)
  14. Vikrama విక్రమ (1880,1940,2000)
  15. Vrisha వృష (1881,1941,2001)
  16. Chitrabhanu చిత్రభాను (1882,1942,2002)
  17. Svabhanu స్వభాను(సుభాను) (1883,1943,2003)
  18. Tarana తారణ (1884,1944,2004)
  19. Parthiva పార్థివ (1885,1945,2005)
  20. Vyaya వ్యయ (1886,1946,2006)
  21. Sarvajit సర్వజిత్ (1887,1947,2007)
  22. Sarvadhari సర్వధారి (1888,1948,2008)
  23. Virodhi విరోధి (1889,1949,2009)
  24. Vikruti వికృతి (1890,1950,2010)
  25. Khara ఖర (1891,1951,2011)
  26. Nandana నందన (1892,1952,2012)
  27. Vijaya విజయ (1893,1953,2013)
  28. Jaya జయ (1894,1954,2014)
  29. Manmadha మన్మధ (1895,1955,2015)
  30. Durmukhi దుర్ముఖి (1896,1956,2016)
  31. Hevalambi హేవళంబి(హేమలంబి) (1897,1957,2017)
  32. Vilambi విళంబి (1898,1958,2018)
  33. Vikari వికారి (1899,1959,2019)
  34. Sarvari శార్వరి (1900,1960,2020)
  35. Plava ప్లవ (1901,1961,2021)
  36. Subhakrit శుభకృత్ (1902,1962,2022)
  37. Sobhakrit శోభకృత్(శోభనః) (1903,1963,2023)
  38. Krodhi క్రోధి (1904,1964,2024)
  39. Viswavasu విశ్వావసు (1905,1965,2025)
  40. Parabhava పరాభవ (1906,1966,2026)
  41. Plavanga ప్లవంగ (1907,1967,2027)
  42. Kilaka కీలక (1908,1968,2028)
  43. Soumya సౌమ్య (1909,1969,2029)
  44. Sadharana సాధారణ (1910,1970,2030)
  45. Virodhikrit విరోధికృత్ (1911,1971,2031)
  46. Paridhavi - పరీధావి (1912,1972,2032)
  47. Pramadi ప్రమాదీ(చ) (1913,1973,2033)
  48. Ananda ఆనంద (1914,1974,2034)
  49. Rakshasa - రాక్షస (1915,1975,2035)
  50. Nala నల (1916,1976,2036)
  51. Pingala పింగళ (1917,1977,2037)
  52. Kalayukti కాళయుక్తి (1918,1978,2038)
  53. Siddharthi సిద్ధార్థి (1919,1979,2039) 
  54. Roudri రౌద్రి (1920,1980,2040)
  55. Durmathi దుర్మతి (1921,1981,2041)
  56. Dundubhi దుందుభి (1922,1982,2042)
  57. Rudhirodgari రుధిరోద్గారి (1923,1983,2043)
  58. Raktaksha - రక్తాక్ష(క్షి) (1924,1984,2044)
  59. Krodhana - క్రోధన (1925,1985,2045)
  60. Akshaya అక్షయ (1926,1986,2046)

Friday 5 December 2014

Sri Dattatreya Swamy Jayanthi

శ్రీ దత్తాత్రేయ జయంతి
(మార్గశిర పౌర్ణమి)
దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ | 
ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ ||
 భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ |
చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ ||
 దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహామునిమహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మవిష్ణుపరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతోచంద్రుడు బ్రహ్మ అంశతోదుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం.
జననము :

అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగాఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి :

ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మీసర్వస్వతిపార్వతి మాతలుమహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. ఈ ఈర్ష్య అసూయ ద్వేషమనే దుర్గుణాలకు లోనయితే! దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని  సర్వులకు  తెలియచెప్పుటకో: లేక శ్రీదత్తుని అవతారానికి నాంది పలుకుటకో! మరి నారదుని ఆంతర్యమేమిటో?
ఏది అయితేనేమి! ఈ గుణాలూ వారి మనస్సునిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంతవారించినాపెడచెవిని పెట్టారు. దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంతు పాడారు. ఇక చేసేది ఏమి లేక సన్యాస వేషములు ధరించి అత్రి ఆనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదంమోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించిందివృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాలచెంత పుష్పాలు పండ్లు నేలకురాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడిపిల్లలు చెంగు చెంగున గంతులువేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలనో  ఏమిటోఅడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్య ప్రాణులకేరింతలతో అ ఆశ్రమ వాతవరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామ మేమిటోఅని వారిని చూచిన పక్షులు కిలకిలా రావలు చేయసాగాయి. ఇవికాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాల సోయగాలుమరోప్రక్క ఆశ్రమ బాలకుల వేదమంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి! మనం ముగ్గురం కూడా  చిన్నారి బాలురవలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ! ఎంతబాగుండునో! అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం అసలు విషయం  మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాంఅని తలచి ఆశ్రమం ముంగిటవైపునకు పయనమయినారు.
మహాతపోబలసంపున్నుడైన కర్దమ మహర్షికిదేవహూతికి జన్మించిన అనసూయాదేవినిముని శ్రేష్టుడు అయిన అత్రిమహర్షికి ఇచ్చి వివాహంచేసారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రిమహర్షికి సేవలు చేస్తూఅతిధి అభ్యాగతులను ఆదరిస్తూ తన "పతి సేవతత్ పరతచే" పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరస్తూపంచభూతాలుఅష్టదిక్పాలకులు సహితం అణకువుగా వుండేలా చేస్తున్న ఆ పతివ్రతామతల్లినిదివ్యతపోతేజోమూర్తి అయిన అత్రిమహర్షిని చూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధుపుంగవుల మువ్వురను చూచిన ఆ పుణ్య దంపతులుసాదరంగా ఆశ్రమంలోనికి అహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసిఅనంతరం మీరు మువ్వురు బ్రహ్మవిష్ణుమహేస్వరులవలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారుభోజనాలు సిద్ధంచేశాను రండి అంటూ! అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో.... చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరతారు. వారి పలుకులు అ పతివ్రతామతల్లికి శిరస్సున పిడుగు పడినట్లు అయింది.
ఒక్కసారి తన ప్రత్యక్షదైవమైన "భర్త"ను మనసారా నమస్కరించుకుంది. "పాతివ్రత్యజ్యోతి" వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాసరూపంలో ఉన్నత్రిమూర్తుల గుట్టు రట్టు అయినది. వారి అంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంటా చిరునవ్వు చెక్కు చెదరకుండా! ఏమినా భాగ్యము! ముల్లోకాలను ఏలే సృష్టిస్థితిలయకారకులైన వీరు నాముంగిట ముందుకు యాచకులవలె వచ్చినారావీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదాఅని ఆలోచిస్తూ! ఒక ప్రక్క పాతివ్రత్యం! మరోవైపు అతిథిసేవ! ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలాఅనుకుంటూ పతికి నమస్కరించి "ఓం శ్రీపతి దేవాయనమః" అంటూ కమండలోదకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే అ ముగ్గురు పసిబాలురయ్యారు! వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగిస్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలుఋషిబాలురు కలిసి మెత్తని పూల పాన్పుతో ఊయలవేయగా! వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది. "ఇ "ఇంతటి మహద్భాగ్యం" సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి....! ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి ఆశ్చర్యపడి మరలాతేరుకునితన దివ్య దృష్టితో జరిగినదిజరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఆ బాలలను ఆ ఆశ్రమమునందే ఉంచినారు. కనని తల్లి దండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్యము ఆ బాలురకు  చాలాకాలం కొనసాగుతుంది.

ఇలా ఉండగా! లక్ష్మీసరస్వతిపార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదునివల్ల అత్రిమహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెల్సుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన "ఈర్ష అసూయ - ద్వేషాలు" పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి స్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని ముని కన్యలు స్వాగతించారు. అ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చిఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది! అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించిస్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూచుకొని పతిబిక్ష పెట్టమని కన్నీళ్ళతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే! మీ మీ భర్తలను గుర్తించి! తీసుకోని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతోఒకేరూపుతోఅమాయకంగా నోట్లో వేలువేసుకొనినిద్రిస్తున్న ఆ
జగన్నాటక సూత్రధారులను ఎవరుఎవరోగుర్తించుకోలేక పోయారు. తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయ్యాలని "ఈర్ష్యఅసూయద్వేషాలతో!" మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంత ఆ అనసూయమాత తిరిగి పతిని తలచుకుని కమండలోదకము తీయు సమయాన! త్రిమూర్తులు సాక్షాత్కరించిఈ ఆశ్రమవాస సమయమందుమీరు కన్న తల్లి దండ్రులకంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరంకావాలో కోరుకోమన్నారు. నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యభాగ్యాన్ని మాకు! మీరు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికిమీకు మేము ముగ్గురము దత్తమవుతున్నాము. మీకీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరమిచ్చి అంతర్థానమయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తరువాత! బ్రహ్మశివుడు వారి వారి అంశలను "దత్తనారాయణు"నికి ఇచ్చినారు. అప్పటి నుండి ఆ స్వామివారు "శ్రీ దత్తాత్రేయ" స్వామిగా అవతార లీలలు ఆరంభించినారు.
                  దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్రగుర చరిత్రఅవధూత గీతజీవన్ముక్త గీతశ్రీపాదవల్లభ చరిత్రనృసింహసరస్వతి చరిత్రషిర్డి సాయిబాబా చరిత్రంశ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు.

శుభం

TELUGU SEASONS,MONTHS & THITHULU.

 TELUGU SEASONS

SEASONS IN TLEUGU - SEASON IN ENGLISH - MONTHS

VASANTHARUTHUVU - SPRING ( CHAITRA & VAISHAKHA) 

GRISHMARUTHUVU - SUMMER ( JYESTHA & ASHADHA)

VARSHARUTHUVU - MONSOON ( SHRAVANA & BHADRAPADA) 

SARADRUTHUVU - AUTUMN ( ASWIYUJA & KARTHIKA)

HEMANTHARUTHUVU - PREWINTER ( MARGASIRA & PUSHYA/PAUSHA)

SISIRARUTHUVU - WINTER (MAGHA & PHALGUNA)


THITHULU

PADYAMI

VIDIYA

THADIYA

CHAVITHI

PANCHAMI

SASHTI

SAPTHAMI

ASHTAMI

NAVAMI

DASAMI

EKADASI 

DWADASI

TRAYODASI

CHATHURDASI

POURNAMI / AMAVASYA