చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి
కార్తీక మాసం లో ప్రధానమైనది చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక మాసం లో 12వ రోజు ని చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి లేక యోగీశ్వర ద్వాదశి లేక హరిబోధిని ద్వాదశి అని అంటారు. పాల సముద్రం లో శేష శయ్యన పై ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శయ్యనించి, నాలుగు నెలలు యోగ నిద్ర లో గడిపి విష్ణు మూర్తి మేల్కొని భూమి మీదకి దృష్టి సారించే రోజు బోధనైకాదశి/ఉత్థాన ఏకాదశి. కాబట్టి తరువాత రోజు చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి ని పరమ పుణ్యదినంగా భావిస్తారు. ఈ రోజున తులసి మరియు ఉసిరి మొక్కలని పూజిస్తారు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తారు.
ఈ రోజు మరో విశిష్టత ఏమిటంటే ఎల్లవేళలా శేషశయ్యన పై శయ్యనించే విష్ణుమూర్తి ఈ రోజున దేవతలందరి తో కలసి బృందావనానికి వెళ్తారు. అందువలన ఈ రోజు ఎవరైతే శ్రద్ధగా విష్ణుమూర్తి ని పూజిస్తారో వారికీ ఆయురారోగ్యాలు మరియు సిరి సంపదలు కలుగుతాయి అని పురాణాలకధనం
ఈ రోజు చేసే స్నానాదులు వలన సర్వ పుణ్య తీర్థాల లో చేసే స్నాన ఫలము మరియు యజ్ఞ యాగాదులు చేసే ఫలితం లభిస్తుంది. ద్వాదశి ముందు రోజు అంతే బోధనైకాదశి/ఉత్థాన ఏకాదశి ఉపవాసం వుండి జాగరణ చేసి ద్వాదశి నాడు వ్రతం ఆచరించి విష్ణు మూర్తి కి నైవేద్యం సమర్పించి అన్నదానం చేస్తే అనంత పుణ్య ఫలం. అన్నదానం వలన సూర్య గ్రహణం రోజున గంగా నదీ తీరములో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వుంటుంది.
క్షీర సాగరాన్ని మదించేందుకు కవ్వంగా భూమధ్య స్థానం లో వున్న మందర పర్వతాన్ని దానికి తోడుగా వాసుకీ సర్పాన్ని చేస్కొని చిలికేందుకు పర్వతాన్ని సంముద్రం లో కి దిన్చాగానే, ఆదారం లేక పట్టు తప్పి పడిపోయింది దాన్ని పైకి లేపి సాగరాన్ని మధించేందుకు వీలుగా విష్ణు మూర్తి కూర్మాఅవతారాన్ని ఎత్తారు. దేవదిదేవులు క్షీరసాగరన్ని మదించారు. ఆ సమయంలో పుట్టిన హాలాహలాన్ని పరమశివుడు కంఠంలో ధరించి సమస్త విశ్వాన్ని కాపాడాడు. ఆ తరువాత క్షీరసాగరం నుండి కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం వంటివి జన్మించిన తరువాత ఒక స్త్రీ ఉద్భవించింది, ఆమే లక్ష్మీదేవి. ఈ క్షీరబ్దిద్వాదశి నాడు శ్రీ హరి లక్ష్మీ దేవిని వివాహమాడాడు. అందు వలన క్షీరబ్దిద్వాదశి నాడు సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ ని పుజిస్తారు. ఈ రోజు తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్క వుంచి పూజిస్తే అనంత పుణ్య ఫలం కలుగుతుంది అని ప్రతీతి.
KSHEERA SAGARA MADHANAM |
కార్తీకమాసంలో రోజు దీపాలు వెలిగించాలేకపోతే ఈ శుద్ధ ద్వాదశి, చతుర్దశి మరియు పౌర్ణమి రోజులలో పెట్టాలి. దీని వలన వైకుంట ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం మరియు దీని వలన అనంత పుణ్య ఫలాన్నిచే పవిత్ర పుణ్యదినం ఈ క్షీరాబ్ది ద్వాదశి.
THULASI POOJA |
No comments:
Post a Comment