కృష్ణాష్టమి
కృష్ణ జన్మాష్టమి:- శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. చంద్రమాన ప్రకారం శ్రావణమాసం లో బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి జర్పుకుంటారు.
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు.
SRI KRISHNA |
శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవ్ లకు ఎనిమిదో సంతానం. పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు 18 జూలై 3228 (ఉమ్మడి యుగానికి ముందు). శ్రీ కృష్ణుడు మథుర లో యాదవ లకు చెందినవాడు .
దేవకీ వసుదేవ్ లు మథుర కి చెందిన వారు, అది యాదవల రాజధాని. దేవకీ అన్న అయిన కంసుడు, తన మరణము దేవకీ వసుదేవ్ ల ఎనిమిదో సంతానం చేత సంభవిస్తుంది అని తెలుసుకొని దేవకీ వసుదేవ్ లను చెరసాల లో బందిస్తడు. కంసుడు దేవకీ వసుదేవ్ ల మొదటి ఆరు సంతానాలను చంపినా తరువాత ఏడవ సంతానం బలరాముడు (బలరాముడు ని రహస్యము గ రోహిణి కి వద్దకు చేరుస్తారు ). తరువాత శ్రీ కృష్ణుడు జన్మిస్తాడు.
శ్రీ మహా విష్ణువు ఆదేశము:-
VASUDEVA |
ఒక నాడు వసుదేవుడుకి స్వప్నములో శ్రీ మహా విష్ణువు దరిశ్నమిచ్చి శ్రీ కృష్ణుడిని గోకులములో యశోద-నంద వద్ద క్షేమము గ వుంటాడు అని చెప్తాడు అప్పుడు వసుదేవుడు యమునా నది ని దాటి గోకులములో వదిలి యశోద కూతురిని తెసుకొని వస్తాడు. అప్పుడు కంసుడు ఎనిమిదవ సంతానము ఆడపిల్ల పుట్టింది అని అనుకుంటాడు అప్పుడు కంసుడు ఆడపిల్లను విసిరేయగ అప్పుడు యోగమాయ గ మారి( విష్ణువు యుక్క దాసి) కంసుడిని హెచ్చరిస్తుంది. శ్రీ కృష్ణుడు బలరాముడి తో పెరిగి పెద్దవాడై కంసుడిని చంపుతాడు.
కృష్ణాష్టమి వేడుకలు:-
కృష్ణాష్టమి నాడు ఉపవాసాలు చేసి శ్రీ కృష్ణుడు జన్మించి నట్టు వారి వారి గృహాల వద్ద మరియు దేవాలయలలో ఊయలలో శ్రీ కృష్ణుడి విగ్రహాలు వుంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా శ్రీ కృష్ణాష్టమి నాడు కొన్ని నగరాలలో గాల్లో వుట్టి కట్టి అది పగలగోట్టటం ఆనవాయతి గ వస్తోంది.
SRI KRISHNA ASHTAMI CELEBRATIONS |
No comments:
Post a Comment